ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ కోచింగ్ వ్యవస్థకు మార్గదర్శి అయిన గురువు చుక్కా రామయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 100 వ జన్మదినం జరుపుకుంటున్న చుక్కరామయ్యకు విద్యానగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ స్వయంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య గారని కొనియాడారు. “ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కా రామయ్య గారిదే,” అని ఆయన పేర్కొన్నారు. వేలాదిమంది విద్యార్థులను ఐఐటి వంటి ఉన్నత విద్యా సంస్థలకు పంపి దేశానికి అద్భుతమైన సేవ చేసిన గొప్ప విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు అపారమైనవని, ఉన్నతమైన విద్యను గ్రామీణ విద్యార్థులకు చేరవేసిన గొప్ప కృషికి ఆయన నిలువెత్తు సాక్ష్యమని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్క రామయ్య అని కొనియాడారు. విద్య ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని ఆయన అన్నారు. అలాంటి చుక్క రామయ్య 100వ బర్త్ డే జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. రామయ్య గారు ఆరోగ్యంగా, సుదీర్ఘకాలం జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
కేటీఆర్ తో పాటు వెళ్లిన నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ , పళ్ళ రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్ చుక్క రామయ్యకు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:BB9:డీమాన్ తల్లి ఎంట్రీ..అంతా ఫిదా

