ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

241
KTR birthday celebrations
- Advertisement -

రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నేతలు, ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత, మంచు విష్ణు, వెన్నెల కిశోర్ తదితరులు కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ నేతలు మొదలుకొని ఆయన అభిమానులు మొక్కలు నాటారు. కేక్స్ కట్ చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేశారు. కేటీఆర్ పుట్టినరోజు సంధర్బంగా ఆయన గురించి ఒక పాట విడుదల చేశారు టీఆర్‌ఎస్ నాయకులు..

KTRbday5

కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని లోకేష్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. లోకేష్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్.. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి పరస్పరం కలిసి పని చేద్దామని ట్వీట్ చేశారు కేటీఆర్.

ktr lokesh tweets

ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. తన పుట్టినరోజును హంగు, ఆర్భాటాలు లేకుండా చేయాలని, మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు మెల్‌బోర్న్ నగరంలో విక్టోరియా రాష్ట్ర ఇన్‌చార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో తెలంగాణలోని సబ్బండవర్గాలు ఉత్సాహంగా పాల్గొంటున్న నేపథ్యంలో తాము సైతం భాగస్వాములమయ్యామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు అనిల్ చీటి, ప్రధాన కార్యదర్శి అర్జున్ చల్లగుళ్ల, పార్టీ నేతలు సునిల్ బసిరెడ్డి, సత్యంరావు గుర్జపల్లి, దిలీప్, సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -