తెలంగాణ యోధుడు,ధీశాలి… కేసీఆర్

249
KTR birth day wishes to CM KCR
- Advertisement -

తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్  రావు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అరవై ఏళ్ల కల సాకారమయ్యేలా చేసిన కేసీఆర్‌ .. అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ప్రపంచంలో ది బెస్ట్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారని ప్రముఖులు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ …సీఎం కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కి ఫోన్ చేసిన మోడీ దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని శుభాశీస్సులు అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు కేసీఆర్‌ మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. ట్విట్టర్‌లో తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామన్న ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అసమానమైన నాయకుడు, ధీశాలి, యోధుడు తన తండ్రి అంటూ  కేసీఆర్ ఫోటోను ట్విట్ చేస్తూ  ‘హ్యాపీ బర్త్ డే డాడ్’ అని విష్‌ చేశారు. ఇక సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు పండగలా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలకు  ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, ఎంపి కవిత, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరలు హాజరయ్యారు.  కవిత, మహమూద్ అలీ, నాయిని కేక్ కట్ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ కెసిఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

- Advertisement -