విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి ధృవ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో రాంచరణ్, కేటీఆర్ లను పొగడ్తు చేసిన వ్యాఖ్యలు చాలామందిని ఆశ్చర్యనికి గురి చేశాయి. ప్రస్తుతం రాజకీయాలలో లేని పోసాని ఇంత పొగడ్తల వర్షం ఎందుకు కురిపించాడు అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
కేటీఆర్ గొప్పోడు. ఆయన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గొప్పోడు. అయితే, కేసీఆర్ గొప్పొడు కావడం వల్ల కేటీఆర్ గొప్పొడు కాలేదు. కష్టపడ్డాడు.. విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసి.. రాజకీయాలపై, తెలంగాణ అభివృద్ధిపై తనదైన ముద్ర వేసుకున్నారు. కేటీఆర్ ట్యాలెంటెడ్…కేటీఆర్‌లో విషయం ఉంది కాబట్టే,..కేటీఆర్‌ను కేసీఆర్ మంత్రిని చేశారు అని పొగడ్తల వర్షం కురిపించాడు పోసాని. పోసాని పొగడ్తునప్పడు పలుమార్లు కేటీఆర్ తన కను సైగల ద్వారా పోసాని ఇంకా చాలు నా గురించి పొగడ్తలు అపండి అటు సందేశం ఇచ్చాడు. అయిన పోసాని కేటీఆర్‌ను వదలలేదు పొగుడ్తునే వచ్చాడు. ఈ ఆడియో వేడుకకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక, ముఖ్యమంత్రుల కొడుకలంతా కేటీఆర్ లా కాలేదు. ఏమీ కానీ వాళ్లు కూడా ఉన్నారంటూ ఓ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ లోకేష్‌ను ఉద్దేశించి చేసినవే అని కొంత మంది తెలుగు తమ్ముళ్లు పొసానిపై మండిపడుతున్నారు. లోకేష్ ని వెంటనే ఏపీ కెబినేట్ లోకి తీసుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు డిసైడ్ అయ్యారట.
కేటీఆర్‌ని ఇలా పొగిడడం అయిపోయిన తర్వాత, పోసాని పొగడ్తల ప్రవాహం చిరంజీవి, రాంచరణ్ వైపు మళ్ళింది. కేసీఆర్ – కేటీఆర్ ఎలానో, చిరంజీవి – రామ్‌చరణ్ అంతేనని పోసాని చెప్పుకొచ్చారు. సినీ రంగంలో ఎందరో ప్రముఖులున్నారు వారి వారసులంతా హీరోలుగా సక్సెస్ అవ్వలేదు కొందరు మాత్రమే సక్సస్ అయ్యారు. చరణ్ సినిమాల్లోకి రావాలనుకున్నాక తండ్రి చిరంజీవి కంటే గొప్పగా ఫైట్లు, డాన్సులు చేయడానికి కష్టపడ్డాడు.. ఆ కష్టమే చరణ్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది…అంటూ చరణ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు పోసాని.
మామూలుగా పోసాని వున్నది వున్నట్లుగా మాట్లాడే వ్యక్తి.. ఇప్పుడెందుకో, ఆయనలో ఇదివరకు కన్పించని కొత్త కోణం కన్పించింది. మొత్తనికి పోసాని వ్యాఖ్యలు ఎలా ఉన్నా ఈ వేడుకకు అత్యధిక స్థాయిలో చరణ్ అభిమానులు రావడంతో ధృవ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కోలాహలంగా మారింది.