పది నెలల్లోనే కరెంట్ ఛార్జీల పెంపా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ఈఆర్సీ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పాల్గొని మాట్లాడారు కేటీఆర్. డిస్కమ్ లంటే డిస్ట్రిబ్యూషన్ సంస్థలే. ఖజానాకు కంట్రిబ్యూషన్ చేసే కంపెనీలు కాదు…విద్యుత్ అంటే వ్యాపారం కాదు..రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే రథచక్రం అన్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదు…రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్ట్ ఉచితంగా నీళ్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి భారం వేయలేదు అన్నారు.మా సిరిసిల్లలో నేతన్నలకు 10 హెచ్ పీ మీద 50 శాతం సబ్సిడీ కూడా ఇచ్చాం..⚡ఇప్పుడు 10 హెచ్ పీలను 30 హెచ్ పీ ల వరకు పెంచి 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నా అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మేము 12 వందల కోట్లు భరించాం. ఈ ప్రభుత్వం ఎందుకు భరించదు? అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిన మేము అందుకు అంగీకరించలేదు..10 హెచ్ పీ వరకు సిరిసిల్ల నేతన్నలకు సబ్సిడీ ఇచ్చాం. నాయి బ్రహ్మణులు, రజకులకు, ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేశాం అన్నారు. దేశంలో సహకారం రంగంలో ఉన్న చాలా తక్కువ విద్యుత్ సంస్థల్లో సెస్ ఒక్కటి..మా నేతృత్వంలోని ఇక్కడి సెస్ పాలక వర్గం బ్రహ్మండంగా పనిచేస్తోందన్నారు.
సిరిసిల్లలో నేతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది…బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లు బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాం వంటి ఆర్డర్ ఇక్కడి నేతన్నలకు ఇచ్చాం అన్నారు.వర్కర్ టూ ఓనర్ పథకం కోసం దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. అప్పెరల్, టెక్స్ టైల్ పార్క్ లను బలోపేతం చేశాం. మరమగ్గాలను మోడ్రనైజేషన్ చేశాం….గత పదేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 10 మందికి పైగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నారు.
Also Read:మహేష్ – రాజమౌళి మూవీ..క్రేజీ అప్‌డేట్!