ఫార్ములా – ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు హాజరుకాగా తాజాగా మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో విచారణకు వచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఎదుట భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్..తమపై కేసులు పెట్టి విచారణల పేరుతో ఇబ్బంది పెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోబోమని అన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తోందని కేటీఆర్ అన్నారు.
ఇవాళ నన్ను ఏసీబీ విచారణకు పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా. విచారణ అనంతరం నన్ను అరెస్టు చేసినా చేయొచ్చు అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చాం. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు.. వంద సార్లయినా జైలుకు వెళ్తా అని తెలిపారు.
Also Read:ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం

