తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలోని గ్లోబల్ హెచ్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలో జరిగిన 5వ ఇంటర్నేషనల్ హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్..ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీ లను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు.పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉందని కితాబిచ్చారు.
ఇండియాలో బిజినెస్ చేయడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నారు.టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాన నెంబర్ వన్ ప్లేస్ లో ఉందన్నారు. రెండేళ్లలో టీఎస్ ఐపాస్ ద్వారా 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న కేటీఆర్..4300 పరిశ్రమలకు అనుమతులిచ్చామని తెలిపారు.
సగానికి పైగా పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించాయని, కార్మికుల హెల్త్ కి పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎక్కువ ప్రధాన్యతనిస్తుందన్నారు. హరితహారం ద్వారా 240 కోట్ల మొక్కలు నాటడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని, ఎంపీ జితెందర్ రెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.