- Advertisement -
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫార్ములా-ఈ కార్ రేస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను అని వెల్లడించారు.
Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..
- Advertisement -