ఏసీబీ కార్యాలయం వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేసు విచారణ కోసం నంది నగర్ నివాసం నుండి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కేటీఆర్ వెంట న్యాయవాదులు ఎవరు కూడా వెళ్లకూడదు అంటూ అభ్యంతరం చెప్పగా చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోని వ్వాలన్నారు కేటీఆర్.
చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చాను అని తెలిపారు కేటీఆర్. కానీ ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్ రాజ్యాంగం నడుస్తుందా?, గతంలో మా పార్టీ నాయకుడు నరేందర్ రెడ్డి గారిని కూడా విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్ ని మీడియాకి వదిలారు అన్నారు.
అదే విధంగా ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉంది..అయినా రాష్ట్ర ప్రభుత్వానికి తన వెంట న్యాయవాదులు ఉంటే సమస్య ఏంటో చెప్పాలన్నారు.లేదా ఒక పౌరుడిగా తనకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలన్నారు. ప్రస్తుతం విచారణ పేరుతో నన్ను ఇక్కడికి పిలిచి… నా ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్.
ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర కూడా జరుగుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదు అని…రేవంత్ రెడ్డి నిన్న రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా కోత విధించి చేసిన ద్రోహం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ కుట్ర చేశారన్నారు.ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్లు చేసినా, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు అని…నాకు ఏసీబీ ఇచ్చిన నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు వచ్చాను అన్నారు.అయితే కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు అన్నారు.
Also Read:సినిమాను సినిమాలా చూడండి!