యురేనియం తవ్వకాలకు అనుమతిలేదు: కేటీఆర్

879
ktr
- Advertisement -

నల్లమలలో యురేనియం తవ్వకానికి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని…ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ అటవీ ప్రాంతంలో ఎలాంటి రోడ్లు వేయరాదన్నారు. మైనింగ్ ఎక్స్‌ప్లోరేషన్‌ కోసం ఐదు షరతులు విధించామని చెప్పారు.

ఒకవేళ యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు కనుక్కొన్నా మైనింగ్‌కు మాత్రం అనుమతివ్వమని వన్యప్రాణి సంరక్షణ విభాగం చెప్పిందని గుర్తు చేశారు.

యురేనియం నిక్షేపాల అన్వేషణలో మనుషులు, యంత్రాలు కదలికల కోసం ఎలాంటి రోడ్లు వేయకూడదని… ఎటువంటి శాశ్వతత నిర్మాణలు జరగకూడదనే నిబంధన ఉందన్నారు. చెట్లను నరకూడదని… ఎక్స్‌ప్లోరేషన్‌ సమయంలో డ్రీల్లింగ్ పూర్తైన తర్వాత యధాతథా స్ధితికి తీసుకురావాలని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసిందని తెలిపారు కేటీఆర్.

- Advertisement -