అన్నీ జడ్పీచైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందు పార్టీ ఇంచార్జీలను ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎకపక్షంగా ఉండబోతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రేపు కౌటింగ్ జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఏక పక్షంగా తీర్పు ఇవ్వనున్నరని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని జడ్పీ ఫీఠాలను కైవసం చేసుకుంటామన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ ఎన్నికల ఇంచార్జ్ లను సోమవారం నియమించారు.
దీనికి సంబంధించిన ఒక ప్రకటనను కేటీఆర్ విడుదల చేశారు. రేపు స్ధానిక సంస్ధల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. దీంతోపాటు జడ్పీ చైర్మన్ల ఎంపిక 8తేదిన జరగనున్న నేపథ్యంలో పార్టీ తరపున గెలిచిన జెడ్పిటీసిలను సమన్వయం చేసుకుని, పార్టీ అధిష్టానం నిర్ణయించే వారిని జడ్పీ చైర్మన్లుగా గెలిపించుకునేందుకు అవసరం అయిన ప్రక్రియను సమన్వయం చేసుకునే భాద్యత పార్టీ నిర్ణయించిన ఇంచార్జీలు చూసుకుంటారని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు జడ్పీల వారీగా పార్టీ ప్రకటించిన ఇంచార్జీల వివరాలు ఇవే.
జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ ఇంచార్జ్‌లు వీరే..
క్రమ సంఖ్య జిల్లా పేరు ఇంచార్జ్ పేరు
1 ఆదిలాబాద్ శ్రీ జోగు రామన్న, మాజీ మంత్రి
2 కొమరంభీం శ్రీ పురాణం సతీష్, ఎమ్మెల్సీ
3 భద్రాద్రి శ్రీ నామా నాగేశ్వరరావు, ఎంపీ
4 జయశంకర్ శ్రీ బండా ప్రకాష్, ఎంపీ
5 జోగులాంబ, వనపర్తి శ్రీ నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
6 నారాయణపేట, శ్రీ శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి
7 జగిత్యాల శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు బీసీ అభివృద్ధి శాఖ
8 జనగామ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
9 కామారెడ్డి శ్రీ గంప గోవర్ధన్, కామారెడ్డి ఎమ్మెల్యే
10 కరీంనగర్ శ్రీ ఈటేల రాజేందర్,వైద్య శాఖ మంత్రి
11 ఖమ్మం శ్రీ నూకల నరేష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి
12 మహబూబాబాద్ శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ
13 ములుగు శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ రూరల్ ఎమ్మెల్యే
14 మంచిర్యాల శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ ఎమ్మెల్యే
15 మెదక్, సిద్దిపేట శ్రీ మాజీ మంత్రి హరీష్ రావు
16 మేడ్చల్ శ్రీ మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
17 నల్లగొండ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ
18 నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్ధన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే
19 నిర్మల్ శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
20 నిజామాబాద్ శ్రీ ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి
21 రంగారెడ్డి శ్రీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ
22 పెద్దపల్లి శ్రీ రవీందర్ సింగ్ – కరీంనగర్ మేయర్
23 సంగారెడ్డి శ్రీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ
24 యాదాద్రి – భువనగిరి శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ
25 రాజన్న శ్రీ భాను ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ
26 సూర్యాపేట శ్రీ జగదీష్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి
27 వికారాబాద్ శ్రీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ
28 వరంగల్ రూరల్ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
29 వరంగల్ అర్బన్ శ్రీ దయాకర్ రావు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి