ఆదిలాబాద్‌లో ఐటీ పార్కు: మంత్రి కేటీఆర్‌

69
ktr
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. జిల్లాలోని బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన కేటీఆర్…అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సబితా ఇంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న రూర‌ల్ టెక్నాల‌జీ పాల‌సీ వ‌ల్ల ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్ లాంటి న‌గ‌రాల్లో ఇప్ప‌టికే ఐటీ పార్కుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. ఆదిలాబాద్ లాంటి ప‌ట్ట‌ణాల‌కు ఐటీ విస్త‌రించ‌డం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న బీడీ ఎన్టీ ల్యాబ్ భ‌వ‌నం కోసం రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామ‌ని చెప్పారు.

 

- Advertisement -