సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన బాలరాజు పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ఇంత కిరాతకంగా పనిచేస్తుంది… ట్రాక్టర్‌ను తీసుకొచ్చి ఇంటి అరుగు మీద కూర్చున్న కుటుంబాన్ని ట్రాక్టర్ ఎక్కించడం చాలా దుర్మార్గం అన్నారు.
నలుగురు కి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి చేరారు… బలమని అమీర్పేట్ హాస్పటల్లో చేరారు..భారతి సీరియస్ కండిషన్స్ తో ఉన్నారు.మొత్తం మూడు సర్జరీ లు చేయాలి అని వైద్యలు తెలిపారు అన్నారు.కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పై అట్టెంప్ట్ మర్డర్ కేస్ నమోదు చేయాలి…జిల్లాలో sp,పోలీసులు నిర్లక్షంగా సమాధానం చెపుతున్నారు అన్నారు.
సూర్యాపేట,నల్గొండ,లో brs అభ్యర్థి పై దాడి చేసి మూత్రం తాగించారు అయినా కేస్ నమోదు చేయలేదు…భారతి, బాలరాజ్ కుటుంబానికి brs తరుపున అని వైద్య ఖర్చులు, కుటుంబానికి అండ గా ఉంటాం. గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు, పోలీసులు తమ డ్యూటీ చేయకపోతే బిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తారు అన్నారు.
వెంటనే కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ గూండాల దాడిలో తీవ్ర గాయాల పాలై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం, సోమార్‌పేట్ గ్రామానికి చెందిన (బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన) బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతి గార్లను ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి పరామర్శించారు.
Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

