సిరిసిల్ల కలెక్టర్ తీరుపై కేటీఆర్ ఫైర్..

28
- Advertisement -

సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై స్పందించారు కేటీఆర్. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా… ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు. సిరిసిల్లలోని టీ స్టాల్ వ్యాపారి శ్రీనివాస్ పైన కలెక్టర్ అక్కసు వెళ్లగక్కారు.

సిరిసిల్లలోని టీ స్టాల్ నడుపుకుంటున్న శ్రీనివాస్ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు జిల్లా కలెక్టర్. పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌కు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి… అక్కడ టీ స్టాల్‌లో ఉన్న కేటీఆర్ ఫోటో చూసి అక్కసు వెళ్లగక్కారు.

ట్రేడ్ లైసెన్స్ నెపంతో టీ స్టాల్ తొలగించాలని మున్సిపల్ శాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టీ స్టాల్‌లో కేటీఆర్ ఫోటో ఉండడంతోనే కలెక్టర్ అలా చేశాడని యజమాని ఆరోపించారు. టీ స్టాల్ పోయినా సరే… కేటీఆర్ ఫోటో తీయనని తేల్చి చెప్పారు యజమాని. శ్రీనివాస్ తన టీ స్టాల్‌ను మూసి వేసేదాకా అక్కడే గుంపుగా కూర్చున్నారు మున్సిపల్ అధికారులు.

Also Read:సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

 

- Advertisement -