KTR:రైతును రాజు చేసే సీఎం కేసీఆర్‌ కావాలా? చోటా చంద్రబాబు కావాలా?

72
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని.. కాంగ్రెస్‌ వస్తే నిన్న ధరణి తీసేస్తామని అన్నడు రాబందు.. నేడు 3 గంటల కరెంట్‌ చాలు అంటున్నారని దుయ్యబట్టారు.

Also Read:#Nani30 ఫస్ట్ లుక్ అప్‌డేట్

నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని.. నేడు చోటా చంద్రబాబు వ్యవసాయానికి మూడు పూటల కరెంట్‌ దండగ అంటున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. మూడెకరాల రైతుకు మూడు పూటల కరెంట్‌ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అని స్పష్టం చేశారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని …రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్‌ కావాలా? మూడు గంటల కరెంట్‌ చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

- Advertisement -