మేము ధర్నా చేస్తాం అనగానే ప్రభుత్వంనికి చలి జ్వరం వచ్చింది….ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం అని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రలను అడ్డుకుంటాం.. కేసీఆర్ నాయకత్వం లో రికార్డ్ స్థాయిలో వరి పండించారు….అప్పుడు సాగర్ ఆయకట్టు కళ కళ లాడింది… ఇవ్వాళ సాగర్ ఆయకట్టు లో దుర్భిక్షం నెలకొన్నది… ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయ్ అన్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతు మహాధర్నాలో మాట్లాడిన కేటీఆర్…….420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు….అర్రస్ పాట పాడినట్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి పచ్చి మోసం చేశారు…రైతు డిక్లరేషన్ అంటూ మభ్యపెట్టారు….అన్ని హామీలను తుంగలో తిక్కారు.. ఇప్పటికైనా తెరుకోవాలి… అన్ని గమనించాలి…. మళ్ళీ మోసపోవద్దు…. ఆనాడే కేసీఆర్ చెప్పారు… మోసపోతే గోస పడతాం అన్నారు.
రేవంత్ అంటేనే ధోకా….దేశమంతా తుడిచి పెట్టుకు పోయిన కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మన తెలంగాణ లో తెచ్చారు…సాగర్ లో సరిపడా నీళ్లు ఉన్నయ్… నీళ్లు ఎందుకు ఎవ్వరు… బిడ్డ ఖబడ్దార్ …నీళ్లు వెంటనే ఇవ్వాలి..జిల్లాలో ఇద్దరు మంత్రులు వున్నా నీళ్లు ఇవ్వడం లేదు.. ఈ సీజన్ లో 180 tmc ల నీళ్లు ఉన్నయ్… విడుదల చేసే అవకాశం ఉంది…. కానీ ఇవ్వడం లేదు..2003 లోనే కేసీఆర్ గారు పాదయాత్ర చేసి నీటిని సాధించారు… ఇప్పుడు నిను చెప్తున్న. …ప్రకటిస్తున్న sep 14 లోపు నీళ్లు ఇచ్చే ప్రణాలిక షెడ్యూల్ ఇవ్వకపోతే మళ్ళీ నిను స్వయంగా కోదాడ నుండి హాలియ వరకు పాదయాత్ర చేస్తానన్నారు.
మర్యాదగా నీళ్లు ఇవ్వాలి.. నీళ్లు లేవు అని చెప్తున్న ఈ మంత్రులు సన్నాసులు సాగర్ దుంకితే తెలుస్తుంది…..నీళ్లు ఉన్నాయో లేవో అని….ఇక్కడి నీళ్లు ఆంద్రకు పోతున్నాయ్…ఇంత దుర్మార్గం ఏక్కడ ఉండదు…… ఓట్లు వేసిన పాపానికి సాగర్ ఆయకట్టు లో నీళ్లు ఇవ్వకుండా ఎడిపిస్తున్నారు…. వెలుగొండ ద్వారా 52 tmc లు ఆంద్రకు పోతున్నాయి… సీఎం మంత్రులు ఆంద్రకు గులాములై అమ్ముడు పోయారు…అందుకే మారు మాట్లాడటం లేదు…..సరిగ్గా 10 రోజులు గడువు ఇస్తున్నాం.. స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయకపోతే పాదయాత్ర చేస్తాము… లక్షల మంది రైతులతో పాదయాత్ర చేసి ప్రభుత్వంన్నీ గద్దె దించుతాం…. గల్లా పట్టి నిలదీస్తాo… ఉద్యమం తప్పదు….నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్.
Also Read:BSP:ఒంటరిగానే బరిలోకి

