నాడు కాలువల నిండా నీళ్లతో ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు కేసీఆర్ అండగా నిలిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పడావుబెట్టి, నీళ్లను ఆంధ్రాకు వదిలి పంటలను ఎండబెడుతుందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా రాదు, సాగునీళ్లు ఇవ్వరు, కరంటు ఇవ్వరు, విత్తనాలు దొరకవు, ఎరువులు ఉండవు, అన్ని గండాలు దాటుకుని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవు అని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో వ్యవసాయ అనుకూల విధానాలతో పండగలా వ్యవసాయం ఉండే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అశ్వారావుపేట నుండి జహీరాబాద్ వరకు వ్యవసాయం తిరోగమనంలో ఉందన్నారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్.. రైతుల గుండెలు మండిపోతున్నాయని పేర్కొన్నారు.
ఏం చేయాలో దిక్కుతోచక కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో నడి ఎండకాలంలోనూ చెరువులు మత్తల్లు దుంకాయని కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read:ఏపీలో 125 స్పెషల్ నీడ్ స్కూల్స్!

