పిల్లలకు ఆహారం పేరుతో విషం పెడతారా?

5
- Advertisement -

ఒక్కటి అయితే తప్పు, రెండు అయితే పొరపాటు, మూడైతే మహా మూర్ఖత్వం అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. వెయ్యి అనేది ఒక వ్యవస్థలేమి, పనిచేయని ప్రభుత్వానికి సంకేతం!, వెయ్యి అనేది ఒక తానేం చేసినా సరే అన్న స్వేచ్ఛాచారితనపు, గర్వం నిండిన నియంతృత్వానికి సంకేతం అని మండిపడ్డారు.

రేవంత్ పాలనలో ఒక్క సంవత్సరంలో — కనీసం 1000 మంది విద్యార్థులు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విష ఆహారం తిని అస్వస్థతకు గురికాగా ఇందులో కనీసం 100 మంది మరణించారు అన్నారు. మీరు, మీ మంత్రులు ప్రతీసారి దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు, దారి మళ్లించారు అని దుయ్యబట్టారు.

ఏ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి అయినా ఇలాంటి పరిస్థితుల్లో తక్షణం చొరవ తీసుకుని చర్యలు తీసుకునేవారే…సీఎం స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఒక్క సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. అందుకే ఓ తండ్రిగా అడుగుతున్నాను. మీ కుటుంబానికి ఇలానే జరిగితే, మీ పిల్లలకు ఆహారం పేరుతో విషం పెడితే… ఎవరిని ఉరి తీయాలి చెప్పండి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also Read:రాజాసింగ్‌పై మాధవిలత ఫైర్

- Advertisement -