రేవంత్ చేతకానితనం వల్లే ఏడుగురు రైతులు బలి అయ్యారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 48 గంటలుగా మోగుతున్న మరణమృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత.. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి అన్నారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడుగురు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం, ఎండుతున్న పంటలు కాపాడుకోలేక గుండెపోటుకు గురై అన్నదాతలు మరణించడం అత్యంత విషాదకరం అన్నారు.
వ్యవసాయరంగంలో మోగుతున్నఈ చావుడప్పుకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం. ఇవి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలే..రాష్ట్ర నలుమూలలా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా ముఖ్యమంత్రిలో కనీసం చలనం లేదు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతను కాపాడాలన్న సోయి రాష్ట్రప్రభుత్వంలో అరశాతం కూడా కనిపించడం లేదు అన్నారు.
రైతులకు ధైర్యం చెప్పాల్సిందిపోయి, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువును కాలం తెచ్చిన కరువుగా చిత్రీకరించే కుట్రల వల్ల అన్నదాతల మనోస్థయిర్యం మరింత దెబ్బతింటోంది… వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాలి అన్నారు. తెలంగాణ రైతుల ఆర్థనాదాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి ఈ గడ్డపై ఇక నూకలు చెల్లినట్టేనని విమర్శించారు.
రేవంత్ చేతకానితనం వల్లే ఏడుగురు రైతులు బలి
– 48 గంటలుగా మోగుతున్న మరణమృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత
– ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలికేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడుగురు… pic.twitter.com/xY0xkk025I
— KTR (@KTRBRS) February 25, 2025
Also Read:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్:ప్రవీణ్ కుమార్