రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.హైడ్రా బాధితుల ఇబ్బంది ముందు మనది ఏం ఇబ్బంది. లగచర్ల రైతుల ఇబ్బంది ముందు మనది ఏం ఇబ్బంది. 40 రోజుల పాటు గిరిజన రైతులను జైల్లో పెట్టారు అన్నారు.
డిసెప్షన్(మోసం), డిస్ట్రాక్షన్(విధ్వంసం), డిస్ట్రక్షన్(దృష్టి మళ్లించడం) ఇదే కాంగ్రెస్ విధానం అన్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్‌లో గెలిచిన తర్వాత నిజాయితీగా.. ఆ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నెలకు రూ. 2500 ఇస్తున్నారు అన్నారు. అదే రేవంత్ ప్రభుత్వం మోసపు మాటలతో కాలం వెల్లదీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ విషయంలో కనిపించిన ప్రతి దేవుడి మీద ఒట్టు పెట్టిండు.. కానీ కాలేదు. కొండారెడ్డిపల్లి, కొడంగల్ పోదాం.. 100 శాతం రుణమాఫీ అయిందని చెపితే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని చెప్పితే ఉలుకు పలుకు లేదు. కౌలు రైతులు అని పదేపదే కలవరించిండు.. 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాస్తున్నా.. వారిని ఆదుకుంటా అన్నావ్.. వీటన్నింటిని మీరు నిలదీయాలి అని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.
Also Read:ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..