మా కుటుంబాలు బాధపడలేదా?: కేటీఆర్

20
- Advertisement -

కుటుంబాలు మాకు లేవా.. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా? నాకు అడ్డమైనవారితో‌ లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా? అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. జర్నలిస్ట్ రేవతిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్.. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ తయారైందన్నారు.

2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.‌. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవన్నారు. సంపద సష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. కేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పదిహేనేళ్ళగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పత్తాలు ఆడేవారితో గాసిప్స్ నడపటం అలవాటంటూ ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని.. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలన్నారు. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసన్నారు. ఫార్ములా ఈరేసింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా తాను వదిలిపెట్టేది లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక.. ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ జరుపుతామన్నారు. రైతులకు ఇవ్వటానికి లేని డబ్బులు.. అందాల పోటీలకు ఎక్కడవి అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తే ఎలా తప్పు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:తెలంగాణ ద్రోహి..రేవంత్ రెడ్డి: గాదరి కిషోర్

- Advertisement -