త్వరలోనే కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ సమావేశం అవుతారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈసారి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ కి మేమే స్వాగతం పలుకుతామంటే ఆయనే స్వయంగా వచ్చి కలుస్తాను, మీతో చర్చిస్తాను అన్నారు అన్నారు.
ఈరోజు మా పార్టీ నేతలు అఖిలేష్ యాదవ్ కి సాదరంగా స్వాగతం తెలిపారు .. మాతో సమయం గడిపినందుకు అఖిలేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో తక్కువ సీట్లు సాధించినా, ప్రజల వెంట నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచింది అన్నారు.
అఖిలేష్ యాదవ్ పార్టీ స్ఫూర్తితో మా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుంది .. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతాము అన్నారు.
Also read;అమేజింగ్‌గా మోగ్లీ కంటెంట్!

