తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి…

218
KTR America Tour Latest Updates
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అమెరికాలోని దిగ్గజ కంపెనీలకు వివరించారు మంత్రి కేటీఆర్. అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్‌ వ్యాలీలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరం అభివృద్ది, అందుబాటులో ఉన్న వనరుల సౌకర్యాలను మంత్రి వివరించారు. మెదట ఇంటెల్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్, మాన్యూపాక్చరింగ్, అపరేషన్స్, సెల్స్) స్టాసీ స్మిత్ తోపాటు కంపెనీ ఛీప్ ఫైనాన్సియల్ అఫీసర్ రాబెర్ట్ హెచ్ స్వాన్ తో ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిని, అక్కడి వ్యాపారావకాశాలు పరిశీలించేందుకు ప్రతినిధి బృందంతో కలిసి రావాల ని మంత్రి కోరారు.

ఇప్పటికే గూగుల్, ఆపిల్ వంటి సంస్ధలు ఇప్పటికే తెలంగాణాలో తమ పెద్ద క్యాంపస్ లను నిర్మిస్తున్నాయని, ఇలాంటి నగరం ఇంటెల్ లాంటి దిగ్గజ కంపెనీ వచ్చేందుకు సరైన నగరమని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని మౌళిక వసతులు, అందుబాటులో ఉన్న టాలెంట్ పూల్, విద్యాసంస్ధల గురించి మంత్రి స్టాసీ స్మిత్ కు వివరించారు. మేక్ ఇన్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో భారతదేశ విస్తరణ ప్రణాళికల్లో తెలంగాణను పరిశీలించాలని కోరారు.

KTR America Tour Latest Updates
ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన ఫ్లెక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి కెటి రామరావు కంపెనీ అధ్యక్షులు డగ్ బ్రిట్ తో సమావేశం అయ్యారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్ పాలసీ, పారిశ్రామిక విధానాల గురించి వివరించిన మంత్రి, తెలంగాణలో కంపెనీ పెట్టుబడులకు పూర్తిగా సహకరిస్తామని, తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంటు ఎర్పాటు చేయాలని కోరారు. మేకిన్ ఇండియా స్పూర్తిని తెలంగాణ  పాలసీ పరంగా, వసతుల పరంగా నూతన తయారీ పరిశ్రమలకు అహ్వానం పలుకుతున్నామని తెలిపారు.

తాము ఎర్పాటు చేస్తున్న మెడికల్ డివైజేస్ పార్క్ లో తయారీ యూనిట్ ఎర్పాటు చేయాలని మంత్రి ప్లెక్స్ కంపెనీని కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రా పాలసీలను తమ ఇండియా ప్రతినిధులు పరిశీలించారని, తెలంగాణ లాంటి రాష్ట్రాలు పరిశ్రమలకు మంచి ఉతం ఇచ్చేలా ఉన్నాయని డగ్ బ్రిట్ తెలిపారు. తమ కంపెనీ ఎలక్ట్రానిక్స్ తయారీతోపాటు ఇతర రంగాల్లోనూ విస్తరిస్తున్నామన్న, ఆయన తెలంగాణను ఖచ్చితంగా విస్తరణలో పరిశీలిస్తామని తెలిపారు. తమ అనుబంద కంపెనీ నెక్స్ ట్రాకర్ ల్యాబ్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా పివి, సోలార్, స్టోరేజ్ రంగాల్లో నూతన ఉత్పదన తయరీ, డిజైన్ వంటి వాటిపై పనిచేయనున్నట్లు తెలిపారు.

KTR America Tour Latest Updates
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ క్లౌడ్  ఏరా కంపెనీతో మంత్రి  సమావేశం అయ్యారు. కంపెనీ సినియర్ ఉపాధ్యక్షులు డానియల్ స్ర్టూమాన్ ప్రతినిధి బృందంతో సమావేశం అయ్యారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా రంగంలో ఉన్న అవకాశాలపైన చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్, పోలీస్, రెవెన్యూ  విభాగాల్లో ఉపయోగిస్తున్న డాటా అనాలిటిక్స్ కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తున్న సిటిజన్ 360 ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో లీకేజీలు లేకుండా పౌరులకు ప్రభుత్వ కార్యక్రమాలను అందించేందుకు వీలు కలుగుతన్నదని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగాల్లోనూ బిగ్ డాటా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం డాటా అనాలిటిక్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో  భాగస్వాములను కావాలని కోరారు. తమ ప్రభుత్వం ఒపెన్ డాటా పాలసీలో భాగంగా ఇప్పటికే ఒక వెబ్ సైట్ ప్రారంభించామని తెలిపారు. ఇలాంటి అంశాల్లో మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు క్లౌడ్ ఏరా కంపెనీ తరపున ఒక సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఎర్పాటు చేయాలని కోరారు.

గ్లోబల్ పౌండ్రీస్ తో సియివో సంజయ్ జాతో మంత్రి సమావేశం అయ్యారు. టి వర్క్స్ ద్వారా చేస్తున్న డిజైన్లు, ప్రొడక్ట్ పరిశోధనల ప్రొత్సాహానికి చేస్తున్న ప్రయత్నాన్ని సంజయ్ అభినందించారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ వెంచర్ కాపిటలిస్టు రాం శ్రీరాంతో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఉన్న స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ పైన , టి హబ్ ద్వారా దానికి లభిస్తున్న ప్రోత్సాహన్ని మంత్రి వివరించారు. వచ్చే సెప్టెంబర్ నెలలో టి హబ్ పర్యటనకు వస్తానని హమీ ఇచ్చారు.

KTR America Tour Latest Updates

- Advertisement -