- Advertisement -
లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీ సమమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్ధులకు,పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న వారికి సూచించారు మంత్రి కేటీఆర్.
ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్ … లాక్ డౌన్ సమయాన్ని పిల్లలు, కళాశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి తల్లితండ్రులకు ఒక సూచన: రాష్ట్ర ప్రభుత్వ టి-సాట్ ఛానెళ్ల ద్వారా ఇంటివద్దనే గణితం, స్పోకెన్ ఇంగ్లీష్, మరెన్నో నేర్చుకోవచ్చు, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చన్నారు.
టి-సాట్ విద్య, నిపుణ ఛానెళ్ల ప్రసారాలు కేబుల్ నెట్వర్క్ ద్వారా, వెబ్సైట్ http://tsat.tv, లేదా Youtube/tsatnetwork, T-SAT Mobile App లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
- Advertisement -