రానాకి సలహా ఇచ్చిన కేటీఆర్…

238
- Advertisement -

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ కావడంతో పాటు ఒక్క క్లిక్ తో వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల చెంతకు చేర్చాలని ప్రభుత్వం అహర్నిషలు కృషిచేస్తోంది.

ఇక తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ తాను ఎంత బిజీగా ఉంటున్నా కూడా ట్రెండును ఫాలో కావడంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంత్రిగా కీలక సమావేశాలు, కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన అక్కడ సెల్ఫీలతో హల్ చల్ చేస్తూ సగటు యువకుడిలా మిగతా యువతరాన్ని ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌ తనకు వచ్చిన ట్విట్లకు సమాధానం ఇవ్వడంతో పాటు సమస్యలు పరిష్కరించటంలో కూడా ముందే ఉంటారు.

rana-ktr

తాజాగా బాహుబలి చిత్రంలో ‘భళ్లాలదేవుడి’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా,కేటీఆర్‌ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నటుడు రానా తన తండ్రి సురేష్‌బాబుతో ఓ సెల్ఫీదిగి.. ‘ఈ నిర్మాతతో తొలిసారి పనిచేస్తున్నా. ఆయనే నాన్న. త్వరలోనే మరిన్ని వివరాలు చెబుతా అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్‌ బాస్‌లు. ఏమాత్రం ఏమరపాటుగా ఉండొద్దు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా రానాకు సలహా ఇచ్చారు. దీనిపై రానా స్పందిస్తూ ‘కృతజ్ఞతలు సర్‌. అంగీకరిస్తా. అర్థంచేసుకుని అనుసరిస్తా’ అంటూ సమాధానమిచ్చారు.

ktr

- Advertisement -