KTR:పట్టభద్రుల స్ధానాన్ని నిలబెట్టుకుంటాం

14
- Advertisement -

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకుంటామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత నాలుగు పర్యాయాలు తమకు అవకాశమిచ్చారని..ఈసారి నిలబెట్టుకుంటామని చెప్పారు. ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్‌ రెడ్డి బొంకుతున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని రేవంత్‌ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. గెలిచిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే.. ప్రశ్నించే రాకేశ్‌ రెడ్డి ఉత్సాహవంతుడైన యువకుడు శాసనమండలిలోకి రావాలని పిలుపునిచ్చారు.

ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. రావాల్సింది ప్రశ్నించే స్వరాలు అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలని …యువకుడు, ఉత్సాహవంతుడైన రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. గతంలో నల్గొండలో నయీంను చూశామని.. ఇటువంటి వ్యక్తులకు చట్టసభల్లో అవకాశమిస్తే అలాంటి వ్యక్తులను తయారు చేసినట్టు అవుతుందని విమర్శించారు.

Also Read:ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌..

 

- Advertisement -