KTR:ఏపీ,బీహార్ బడ్జెట్‌లా కేంద్రబడ్జెట్

29
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో న్యాయం చేస్తారని అనుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ, బీహార్ బడ్జెట్‌లా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్…. కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేశారు కానీ తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం బాధాకరం అన్నారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు ఉన్నాయ్, అమరావతికి 15వేల కోట్ల, భవష్యత్ లో ఆదుకుంటమన్నారు, పోలవరాంకు సహకరిస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశలో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు…మాకు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినందుకు బాధలేదు, మిగతా రాష్ట్రాలను పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు కేటీఆర్.

మనకు విభజన అంశాలు చాలా హామీలు ఉన్నాయ్ ,గిరిజన యూనివర్సిటీ ,బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో వ్యాగన్ కోచ్ ఇలాంటి హామీలను పట్టించుకోలేదన్నారు. గత 9 సంవత్సరాల పాటు కేసీఆర్, అనేక సార్లు కేంద్రమంత్రులను కలిసి విన్నవించారని,పారిశ్రామిక కారిడర్ లు ఏర్పాటు చేయాలని కోరారన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ ఒక్కటి అంటే ఒక్కటి కూడా సాధించలేదన్నారు. బీజేపీ నుంచి ఇంతమంది ఎంపీలు ఉన్న, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి ఒక్క రూపాయి తీసుకొని రాలేకపోయారు,ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు గుండు సున్నా ఇవ్వడం జరిగిందని మండిపడ్డారు కేటీఆర్.

Also Read:Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్

- Advertisement -