KTR:పరిశ్రమలకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ

36
- Advertisement -

తెలంగాణ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిందన్నారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డిలో మాట్లాడిన ఆయన..రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి..అవి ఎన్నికప్పుడు చేసుకోవచ్చు..కానీ పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చిందని…తెలంగాణ లో పెట్టుబడులు పెట్టె పరిశ్రమలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.ఇది జీరో పొల్యూషన్ ప్లాంట్..18 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మీ ప్రాంతాల్లో పరిశ్రమ వస్తే సహకరించాలన్నారు. కొంతమంది రాజకీయాలు చేస్తారు.. నిజా నిజాలు తెలుసుకోవాలన్నారు.

మన మీద నమ్మకం తో పెట్టుబడి పెడుతున్న వారికి అన్ని రకాలుగా సహకరించాలన్నారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందని…భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. తెలంగాణలో 5 రకాల విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయన్నారు.

Also Read:కుర్ర దర్శకుడి పై తప్పుడు వార్తలు

- Advertisement -