KTR:బ్లాక్‌లిస్టులో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ సంస్థ?

12
- Advertisement -

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్‌లో నీళ్లు ఎత్తి పోయాలంటే 510 అడుగుల నీళ్లు ఉండాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ 462 అడుగులు ఉన్న సుంకిశాల ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరానికి నీళ్లు ఇవ్వొచ్చని కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.వద్దు అన్నా కూడా ఆగం ఆగం పనులు మొదలు పెట్టి సుంకిశాల ప్రాజెక్ట్ గేట్లు బిగించారని ఇంజినీర్లు చెప్తున్నారన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఫ్లో వస్తుంది, వరద వస్తుందని చెప్పినా వినకుండా తొందర తొందరగా పనులు కావాలని మాకు ఆదేశాలు పంపారు..మా మాట వినకుండా హడావిడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగిందని ఇంజనీర్లు చెప్తున్నారు అన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి..కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద వచ్చిన ఎన్డీఎస్ఏ, కేంద్ర సంస్థలు సుంకిశాల మీద ఎందుకు రావడం లేదు అన్నారు. సుంకిశాల ఘటన మీద ఒక్క బీజేపీ నేత కూడా ఎందుకు మాట్లాడటం లేదు…దీనిపై ఒక జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయండి, ఆ నిర్మాణ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి – కేటీఆర్ మంచి జరుగుతే మీ ఖాతాలో వేసుకుంటారు, చెడు జరుగుతే ఇతరుల మీద బురద చల్లుతారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నాడు ఆగస్టు రెండున ఈ సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం జరిగింది…అసెంబ్లీ గౌరవ సాంప్రదాయాల ప్రకారం రాష్ట్రంలో ఏ మంచి జరిగినా లేదా ఏ చెడు జరిగినా అసెంబ్లీలో సభ్యులందరికీ తెలియజేయాలన్నారు.

కానీ ఎవరికీ తెలియకుండా దీన్ని తొక్కి పెట్టారా లేక ముఖ్యమంత్రి గారికి తెలియదా.. ముఖ్యమంత్రికి తెలియదు అంటే మాత్రం అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు అన్నారు. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి మేము కొంచెం వేగంగా సుంకిశాల ప్రాజెక్టు పనులు చేశాం.. మేము దిగేనాటికి అక్కడ మోటర్లు ఫిట్టింగ్ జరుగుతుందన్నారు. మా ప్రభుత్వం దిగిపోయాక అక్కడ పనులన్నీ ఆగిపోయాయి.. మా ప్రభుత్వం మళ్లీ వచ్చుంటే మేము 2024 మార్చి, ఏప్రిల్ వరకు పనులు కంప్లీట్ చేసి హైదరాబాద్ నగర వాసుల త్రాగునీటి కష్టాలు తీర్చాలి అని చూశాం అన్నారు. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల మొద్దు నిద్రలో ఉండటం వల్ల సుంకిశాల ప్రాజెక్ట్ పనులు అటకెక్కాయని మండిపడ్డారు.

Also Read:Chandrababu: ఆదివాసీ మహిళలతో చంద్రబాబు నృత్యం..వీడియో

- Advertisement -