ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోండి: కేటీఆర్

1
- Advertisement -

తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని కేటీఆర్ కోరారు. నందినగర్‌లో వీరిద్దరి భేటీ సందర్భంగా కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు.

కరీంనగర్‌లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు.

కేటీఆర్ చేసిన విజ్ఞప్తుల పట్ల బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. టీటీడీ తరఫున తెలంగాణ భక్తుల దర్శనాల విషయంలో, అలాగే ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.

Also Read:KTR: గ్యారెంటీల పేరుతో ఆస్తుల జప్తా!

- Advertisement -