కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్‌లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై ఎక్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
ఎంతో నైపుణ్యం కలిగిన పవర్‌లూమ్ నేతన్నలు అభివృద్ధితో పాటు తమ కార్యకలాపాలు విస్తరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, వస్త్ర పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమకు సంబంధించి 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని… వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందన్నారు.
The homegrown talented power loom weavers of Siricilla have seen great growth & expansion since the formation of Telangana with the active support of state Government
My request to the Congress Government is to continue and strengthen the sector more as it has the potential to… pic.twitter.com/xmXlQZ4R6u
— KTR (@KTRBRS) January 16, 2024
Also Read:ప్రభాస్..రాజా సాబ్