KTR:సింగరేణిని కాపాడుకుంటాం

16
- Advertisement -

సింగరేణిని నష్టాల్లోని నెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు,కార్మిక సంఘం నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై సింగరేణి గనులను అమ్మకానికి పెట్టారన్నారు.

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలన్నదే బీఆర్ఎస్ విధానం కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందన్నారు.

గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయన్నారు. తెలంగాణ గొంతుక పార్లమెంట్‌లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలో ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నాఉ. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటాం అని స్ప‌ష్టం చేశారు.

Also Read:కల్కి హిట్..నారా లోకేష్ విషెస్

- Advertisement -