KTR: ఛిద్రమవుతున్న చేనేత బ్రతుకులు

10
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేనేత బ్రతుకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం.. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమమని తెలిపారు. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పమని అని పేర్కొన్నారు.

వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్.. ఓ సంచలనమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు చిందించాయని.. కానీ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు.. మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు.. వినూత్న పథకాలకు శ్రీకారంచుట్టిన పాలకుడు.. మన కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.

దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో చేనేత మిత్ర తీసుకొచ్చామని.. నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం అని కేటీఆర్‌ తెలిపారు. నేతన్నకు బీమా పేరుతో 5 లక్షల రూపాయల ధీమా, 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు కొండంత అండ అందించామని చెప్పారు. రేవంత్ పాలనలో మళ్లీ చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Also Read:Paris Olympics: వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు

- Advertisement -