KTR:ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ ఏమైంది?

23
- Advertisement -

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…కాంగ్రెస్ నేతల భట్టి, ఉత్తమ్,కోమటిరెడ్డి, సీతక్క ఎల్‌ఆర్‌ఎస్ పై మాట్లాడిన మాటలను వినిపించారు.

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు కట్టమంటే ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారని ఆనాడు విమర్శించారని..ఇవాళ కాంగ్రెస్ చేస్తుంది ఏంటి ఆలోచించాలన్నారు.ప్రస్తుతం ఎల్‌ఆర్ఎస్ ఫీజుల రూపంలో కాంగ్రెస్ డబ్బులు వసూల్ చేస్తోందన్నారు.

ఆనాడు బీఆర్ఎస్ ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొస్తే రక్తమాంసాలు పీలుస్తున్నారని మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రక్తమాంసాలు పీలుస్తుందా అని ప్రశ్నించారు.ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా కాంగ్రెస్ ప్రజల నుండి రూ.20 వేల కోట్లు రాబట్టాలని చూస్తోందన్నారు.

Also Read:ఆదిలాబాద్‌కు ప్రధాని..

- Advertisement -