భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్‌ని గెలిపించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇబ్రహీంపట్నంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ రాజకీయ ప్రాధాన్యం ఇస్తున్నారని, అందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించుకుందామన్నారు.
అంబేద్కర్, ఫూలే మాటలను ఆచరణలో అమలు చేసింది కేసీఆర్ అని తెలిపిన కేటీఆర్…. 1008 గురుకుల పాఠశాలలను కేసీఆర్ స్థాపించారన్నారు. గురుకులాల్లో ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు లక్షా 20 వేల చొప్పున ఖర్చు పెట్టి చదివించారని చెప్పారు. చేతి వృత్తులకు, కులవృత్తులకు కేసీఆర్ అండగా నిలబడ్డారన్నారు.
మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా, మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు కేటాయించారన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు, దళిత బంధు అమలు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట ఒక్కొక్క దళిత విద్యార్థికి రూ. 20 లక్షలు ఇచ్చి విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలబడ్డారు.
Also Read:Harishrao:మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే