KTR:జయశంకర్ సార్ విగ్రహాం ధ్వంసం..హీనమైన చర్య

32
- Advertisement -

తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పగలగొట్టిన సంఘటన పైన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఓ దుండగుడు. సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేశారు కేటీఆర్.

Also Read:CPM:తమ్మినేనికి గుండెపోటు

- Advertisement -