భారత ఆర్మీకి అండగా ఉందాం

16
- Advertisement -

భారత ఆర్మీకి అండగా ఉందామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ దివంగత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తల్లాడ మండలం మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ… పాకిస్థాన్‌తో భారతదేశం పోరాడుతోందన్నారు. ఇండియన్ ఆర్మీ విరోచితంగా పోరాడుతున్నారని కొనియాడారు.

రాయల శేషగిరి రావు రైతుల కోసం పోరాడారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అంత నికృష్ట ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ఢిల్లీలో అపాయింట్‌మెంట్స్ ఇవ్వటం లేదు. చెప్పులు ఎత్తుకుపోయే వాడిగా, దొంగలా చూస్తున్నారట. దొంగను దొంగలా చూడక ఎలా చూస్తారు అంటూ ఎద్దేవా చేశారు.

అంబేద్కర్ కూడా ఇటువంటి దుర్మార్గులు వస్తారని ఊహించి ఉండరన్నారు. తొందరలోనే ప్రజలకు మంచి అవకాశం వస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని.. తామంతా సీరియస్‌గా పని చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అన్నీ గెలవాలని పేర్కొన్నారు.

Also Read:మార్పు బాగుందా?: కేటీఆర్

- Advertisement -