గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి ఘటనపై సీరియస్ అయ్యారు మంత్రి కేటీఆర్. గాంధీ,నిజామాబాద్‌లో జరిగిన ఘటనలవంటివి సహించబోమని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదని…ఈ రెండు ఆస్పత్రుల్లో దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కరోనా వ్యాధి వారికే పరిమితం కాదు, వారి నుంచి ఇతరులకూ వ్యాపిస్తుందని…ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి చికిత్సకు, పరీక్షలకు సహకరించాలన్నారు కేటీఆర్.
డాక్టర్లు, ఇతర సిబ్బందిపై దాడులకు పాల్పడితే మూడేండ్ల జైలుశిక్ష తప్పదు. దీంతోపాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. ‘మెడికేర్ సర్వీస్ పర్సన్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్స్ (ప్రొటెక్షన్ ఫ్రమ్ వయొలెన్స్ అండ్ డ్యామేజి ప్రాపర్టీ) చట్టం 2008 ప్రకారం దోషులకు శిక్ష పడుతుంది. ఈ కేసు నమోదైతే బెయిల్ కూడా లభించదు.