KTR: ఫాక్స్‌కాన్‌ను తీసుకొచ్చిందే కేసీఆర్

3
- Advertisement -

తెలంగాణకు ఫాక్స్‌కాన్‌ను తీసుకొచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్‌ వేదికగా స్పందించిన కేటీఆర్.. మరికొన్ని నెలల్లో కంపెనీ ప్రారంభం కానుండటం గర్వంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టి మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు కేటీఆర్.

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హాన్‌ హాయ్‌ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో రూ.1656 కోట్లకుపైగా పెట్టుబడితో కొంగరకలాన్‌లో పరిశ్రమను నెలకొల్పనుంది. దీనికి సంబంధించి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో 2023లో ఫాక్స్‌కాన్‌ ఒప్పందం చేసుకుంది.

Also Read:చైతన్య దీప్తి – అబ్దుల్ కలాం

- Advertisement -