KTR:ఫార్మర్ ఫస్ట్ నినాదంతో పనిచేశాం

12
- Advertisement -

ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ ప్రభుత్వంలో రైతు మరణాలు తగ్గడంపై అరవింద్‌ వారియర్‌ అనే నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు స్పందించారు.

దేశంలోనే తొలిసారి కేసీఆర్‌ హయాంలో రైతు బంధు అమలు చేశామని..రైతులు జీవితాల్లో వెలుగు నింపడం కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం అన్నారు. 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు ఖాతాల్లో వేశామన్నారు. ప్రతి రైతుకు రైతు బీమా పేరుతో రూ.5 లక్షల జీవిత బీమా కల్పించామని ..రూ.25 వేల కోట్లతో రుణమాఫీ అమలు చేశామని వెల్లడించారు.

Also Read:యోగా…ఈజీ ఆసనాలివే!

- Advertisement -