KTR: చార్మినార్ గుర్తును తొల‌గిస్తారా?

15
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ గుర్తును తొలగించడం సిగ్గుచేటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్… ఎవ‌రైనా హైద‌రాబాద్ గురించి ఆలోచిస్తే, వాళ్లు చార్మినార్ క‌ట్ట‌డం గురించి ఆలోచించ‌కుండా ఉండలేర‌న్నారు.

ఆ మ‌హాద్భుత నిర్మాణానికి యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ సంప‌ద గుర్తింపున‌కు కావాల్సిన అర్హ‌త‌లు ఉన్నాయ‌ని అన్నారు. అలాంటి ఐకానిక్ చార్మినార్ గుర్తును.. రాష్ట్ర లోగో నుంచి తొల‌గించాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. అనుచిత కార‌ణాలు చూపుతూ.. లోగో నుంచి చార్మినార్ గుర్తును తీసివేయ‌డం సిగ్గుచేటు అని ఆయ‌న అన్నారు.

Also Read:మరో కొత్త వైరస్‌.. వస్తే 3 రోజుల్లోనే ఖతం!

- Advertisement -