2025లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్

0
- Advertisement -

2025 సంవత్సరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం…అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు కేటీఆర్. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్…పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం అన్నారు.

గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని స్టైల్ లో పార్టీని బలోపేతం చేస్తూ ..పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికల అంశంలో పార్టీగా నిర్ణయం తీసుకొని చెప్తాము…ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాష్ట్రస్థాయిలో కమిటీని నియమిస్తామన్నారు. త్రిబుల్ ఆర్ రోడ్డు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చిందన్నారు.

అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్లో ఆమోదం కూడా తెలిపింది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక చేసింది ఏమీ లేదు అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా సంవత్సరంలో లక్ష 39 వేల కోట్ల ఆప్పు ఎందుకు చేసింది…ఒక్క కార్యక్రమం చేపట్టకుండా ఈ అప్పులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారు అన్నారు. ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరంలో ఇంత పెద్ద అప్పు చేయడం దేశంలోనే రికార్డ్…మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని ఈ విధంగా అప్పుల పాలు చేస్తుందన్నారు. అప్పుల కోసమే అప్పులు చేస్తున్నామని మీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.

Also Read:KTR: హైడ్రా పేరుతో విధ్వంసం

- Advertisement -