దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపాం: కేటీఆర్

3
- Advertisement -

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు కేటీఆర్.మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్లో నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. 2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగుతాయని అనుమానాలు వ్యాప్తి చేశారు అన్నారు.

కానీ కేసీఆర్ గారి పదేళ్ల హయంలో గంగా-జమున తహజీబ్ ను పాటించటంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు..అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇచ్చారు అన్నారు. అందరినీ కలుపుకొని పోతామని చాలా మంది చెబుతారు. కానీ కేసీఆర్ గారు చేసి చూపించారు అన్నారు. 200 లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను కేసీఆర్ ఏర్పాటు చేశారు. దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులపై ఏటా రూ. లక్షా 20 వేల ఖర్చు చేశారు అన్నారు.

మౌలానా అబుల్ కలాం పేరుతో 2,751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షలు రూపాయలు ఇవ్వటం జరిగింది. దాదాపు రూ. 438 కోట్లు ఖర్చు చేశారు అన్నారు. నాంపల్లి లో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ. 40 కోట్లతో అనిసిల్ గుర్బాను నిర్మించారు..మక్కా మసీదు మరమత్తుల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారు అన్నారు. ఇస్లామిక్ సెంటర్ కోసం రూ. 40 కోట్లతో సెంటర్ ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు..రూ. 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలోనే ఎవరు ఖర్చు చేయని విధంగా కేసీఆర్ చేశారు అన్నారు.

Also Read:సర్వే అధికారులకు ఎమ్మెల్యే మాధవరం షాక్

- Advertisement -