గ్లామర్ ను నమ్ముకున్న మరో బ్యూటీ

23
- Advertisement -

ట్రెడిషనల్ గర్ల్ గా, పక్కింటి అమ్మాయిగా కనిపించే కృతి శెట్టి కొద్దిరోజులుగా గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియాలోనే కాదు ఆమె నటిస్తున్న సినిమాలు కూడా అలానే ఉంటున్నాయి. కృతి శెట్టిని సాంప్రదాయ పాత్రల్లో చూసిన ఆమె అభిమానులు ఇప్పుడు బోల్డ్ కేరెక్టర్స్ లో చూసి తట్టుకోలేకపోతున్నారు. గ్లామర్ షో చేసేది ఫాన్స్ కోసము, యూత్ కోసమే. కానీ కృతి శెట్టి అభిమానులు మాత్రం ఆమె గ్లామర్ షో చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ప్రస్తుతం కృతి శెట్టిలో వచ్చిన మార్పులు చూసి ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు.

ఐతే, ఆ మధ్య కృతి శెట్టి కు వరుస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. అటు తమిళంలోనూ కృతి శెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ లో కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తుంది అనుకునే సమయంలో వరుస ఫ్లాపులు పడ్డాయి. కృతి శెట్టి గ్రాఫ్ క్రమంగా డౌన్ అవ్వడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్ వైపు మల్లింది. కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో సహజంగా హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటుతారు.

మొత్తమ్మీద తెలుగులో స్టార్స్ సినిమాల ఛాన్స్ లు కోసం అందాల ఆరబోత కు కృతి శెట్టి సిద్ధం అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి శెట్టి.. ఈ మధ్య తరచూ స్టన్నింగ్ ఫోటో షూట్లతో కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతుంది. కృతి శెట్టి ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read:రోజు నిమ్మరసం తాగుతున్నారా?

- Advertisement -