krithi shetty:ప్రేమ పై కృతి శెట్టి స్పందన

33
- Advertisement -

యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’ అనగానే పద్ధతిగా ఉంటుంది. అసలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా ఆ అమ్మాయి హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి కృతి శెట్టి గురించి. దీనికితోడు కృతి శెట్టి కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే, అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ కృతి శెట్టి చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది. కానీ.. తాజాగా కృతి శెట్టి ఒప్పుకున్న ఓ బోల్డ్ పాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమాలో కృతి శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందట. అన్నట్టు కృతి శెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాన ఊపేస్తున్నాయి. తన రిలేషన్‌షిప్‌ పై కృతి శెట్టి చేసిన ఆ కామెంట్స్ ఆమె మాటల్లోనే విందాం. ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందుకే, నేను కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాను. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు’ అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఇక తన ప్రేమ పై కూడా కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది.

నిజానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్‌ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పగలను.’ అంటూ కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ లో అందంలోనూ అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో కృతి శెట్టి కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ జోలికి పోకుండా.. పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Also Read:‘సౌండ్‌ ఆఫ్‌ సలార్‌’ వైరల్

- Advertisement -