బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన కొత్త రాఖీ పండుగ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్ ‘GIVA’ రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన ‘ఇండో-వెస్ట్రన్’ దుస్తులపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ యాడ్‌లో కృతి సనన్ బ్రాలెట్ శైలి బ్లౌజ్, కేప్ మరియు డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సాంప్రదాయక పండుగ వాతావరణంలో తన ఆన్‌స్క్రీన్ సోదరుడికి రాఖీ కడుతున్నప్పుడు ఆమె వేసుకున్న ఈ ఆధునిక దుస్తులు సంస్కృతికి తగినట్లుగా లేవని పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇంత పవిత్రమైన పండుగకు ఇలాంటి దుస్తులు వేసుకోవడమేంటి? , పూజా థాలి ఎక్కడ? ఇదెక్కడి ఫ్యాషన్? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు.
అయితే ఈ విమర్శలపై కృతి అభిమానులు తీవ్రంగా స్పందించారు.మహిళలు సాంప్రదాయ పండుగల సమయంలో నిర్దిష్టమైన దుస్తులు మాత్రమే వేసుకోవాలనే భావనను ఈ ప్రకటన బ్రేక్ చేసిందని సపోర్టర్లు తెలిపారు. సినిమాల్లో బికినీ సీన్లలో నటించినప్పుడు ఈలలు వేసే జనం, ఇప్పుడు ఆమె ఏ దుస్తులు వేసుకోవాలో చెప్తూ నీతులు నేర్పడం విడ్డూరంగా ఉందంటూ ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాఖీ అనేది సోదరసోదరీమణుల మధ్య ఉన్న ప్రేమకు చిహ్నమని, ఇక్కడ దుస్తుల కంటే అనుబంధానికే ప్రాధాన్యత ఉండాలని అభిప్రాయపడ్డారు.
Also Read:ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’
ఈ వివాదంపై కృతి సనన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

