రంగమార్తాండ..ప్రకాశ్‌ రాజ్ సినిమా: కృష్ణవంశీ

100
krishnavamshi
- Advertisement -

మరాఠి సినిమా నటసామ్రాట్ కి రీమేక్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు కృష్ణవంశీ. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్‌’ రీమేక్‌లో యాక్ట్ చేస్తూ ఈ సినిమాకు డైరెక్ట్‌ చేయాలని ప్రకాశ్ రాజ్ అనుకున్నాడని తెలిపారు కృష్ణవంశీ. ఒకరోజు నన్ను కలిసి ఈ సినిమాని రీమేక్‌ చేయాలి అనుకుంటున్నాను. నాకు స్క్రీన్‌ ప్లేలో సహాయం చెయ్యి అని అడిగాడు. ఆ తర్వాత నట సామ్రాట్ సినిమా చూసి చాలా చోట్ల ఏడ్చేశానని చెప్పాడు.

సినిమా చూసిన తర్వాత ఇది ఎక్స్‌ట్రార్డినరీ సినిమా, రీమేక్‌ చెయ్, ఇందులో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను అని అన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రకాశ్ రాజ్.. నేను డైరెక్ట్‌ చేస్తూ యాక్ట్‌ చేయడం కంటే కూడా నువ్వు ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్‌ చేస్తావు అని ఒప్పించాడని తెలిపారు.

- Advertisement -