కృష్ణంరాజు…యోగా పాఠాలు

243
krishnam raju
- Advertisement -

జూన్ 21(రేపు) అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచమంతా సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఈ సారి ఇంట్లోనే అంతా యోగా జరుపుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు యోగా టీచర్‌ అవతారమెత్తారు.

యోగా డే సందర్భంగా సోషల్ మీడియాలో వీడియోని షేర్ చేశారు కృష్ణంరాజు. యోగా ద్వారా జీవితాల్లో మనశ్శాంతి లభిస్తుందని… శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అందరు రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టిసారించాలని…రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలానో వివరించారు. ప్రాణ క్రియ ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుందని యోగాతో డిప్రెషన్‌ దూరం అవుతుందని చెప్పారు.

- Advertisement -