కొండగల్ లో ఇంటర్ నెట్ షట్ డౌన్ చేశారు అని ఆరోపించారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్. బాలల దినోత్సవం గూర్చి ముఖ్యమంత్రి మాట్లాడుతారు అనుకున్నాం…పిల్లల కార్యక్రమంలో కూడా కేసీఆర్ ,కేటీఆర్ గూర్చి మాట్లాడి తిడుతున్నారు అన్నారు. కొండగల్ నియోజకవర్గ రైతుల గూర్చి పిల్లల గూర్చి మాట్లాడితే బాగుండు…కొడంగల్ ఫార్మా ఇష్యూ లో కేటీఆర్ గూర్చి నేను ఏమి మాట్లాడలేదు అని..మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రిమండ్ రిపోర్ట్ లో ఉందన్నారు.
ముఖ్యమంత్రి అన్న వచ్చారని కలెక్టర్ ,ఎస్పీ స్వాగతం పలుకుతారు…కేటీఆర్ పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు అన్నారు. కాంగ్రెస్ కుట్ర కోణం అంటుంది..వాళ్ళతో ఆధారాలు లేవు అన్నారు. రాఘవ ,మెగా కాంట్రాక్టు లను ఆధారాలతో బయట పేట్టారు…కొడంగల్ ఫార్మా గూర్చి ముఖ్యమంత్రి గప్ చుప్ గా ఉన్నారు..మాక్స్ బీయన్ రేవంత్ అల్లుడీది అన్నారు.
అల్లుడి మ్యాక్స్పియన్ ఫార్మా కంపెనీ గురించి కేటీఆర్ గారు ఆధారాలు పెట్టగానే రైతుల గురించి స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం అల్లూరి ఫార్మా కంపెనీ గురించి స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం , సీఎంఓ కార్యాలయం అధికారులు బలవంతంగా మెడికవర్ కు Maxbien pharma కు సంబంధం లేదని అబద్ధపు స్టేట్ మెంట్ ఇప్పించారు అన్నారు.
రేవంత్ లా కేటీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడరు..స్వయాన రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగురి సత్యనారాయణ రెడ్డి సంతకం పెట్టిన డాక్యుమెంట్లో 16,92,000 షేర్లు రేవంత్ రెడ్డి అల్లునికి, 1,08,000 షేర్లు అన్నం శరత్ కి , 20,33,333 షేర్లు అన్నం శరత్ కి సంబంధించిన ఎస్వీఎస్ ఫెసిలిటీకి ఉన్నాయి. సంబంధం లేదని ఎలా అంటారు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీకి మెడికోవర్ అన్నం శరత్ కు ముమ్మాటికి ఆర్థిక సంబంధాలు వ్యాపార సంబంధాలు ఉన్నాయి…కేవలం అల్లుని ఫార్మా కంపెనీ బట్టబోయిన తర్వాత కాపాడటానికి ఈరోజు రైతులను జైలులో వేశారు అని దుయ్యబట్టారు.
Also Read:KTR:ఫార్మాసిటీ విషయంలో భంగపాటే!