ఇజ్రాయెల్‌తో కొండల్ రెడ్డి ఒప్పందాలు?

1
- Advertisement -

ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి…ఇజ్రాయెల్‌తో ఒప్పందం ఎలా చేసుకుంటారని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు..మరి మీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్..రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి, ఫహీం కురేషి విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి…తెలంగాణకు ఏమో ఒక్క కంపెనీ రాదు.. రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి ఏ దేశానికి పోయినా ఆయనతో మాత్రం అక్కడ అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు అన్నారు.హవాలానా, షెల్ కంపెనీలా, నల్లధనమా.. దేనికోసం వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నారు.

రేవంత్ రెడ్డి చెప్తే ఇజ్రాయెల్ వాళ్ళు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు..రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం దావోస్‌కి వెళ్లి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్లని కలిస్తే.. వాళ్లు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు అప్పుడే ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారితో రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా భేటీ అయ్యాడు అన్నారు.

Also Read:టిల్లూ గ్యాంగ్ సభ్యుడికి బెయిల్..హైకోర్టు స్టే

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు..కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనే కొత్త కంపెనీకి కూడా చైర్మన్ అయ్యాడు.. ఆయన అంత పెద్ద సైంటిస్టా మరి? అని ప్రశ్నించారు.

- Advertisement -